2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గూస్ బంప్స్ మూమెంట్
Published on Wed, 09/23/2026 - 07:48
గుజరాత్లో మంగళవారం జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు, తారలు అవార్డు విజేతల జాబితాలో ఉన్నప్పటికీ కేవలం మూడే మూడు సందర్భాల్లో అవార్డు విజేతలు ముగ్గురికీ సభికులు తమంతట తాముగా గౌరవ సూచకంగా లేచి నిలబడి మరీ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
తరగని మమ్ముట్టి క్రేజ్
యాభై సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంతో వివిధ భాషల సినీ ప్రేమికులను అలరించిన కన్నడ నటుడు అనంత నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్న సంగతి వేదికపై నుంచి ప్రస్తావించినప్పుడు ముందు వరుసల్లోని అవార్డు విజేతలతో సహా సభాంగణంలోని అందరూ లేచి నిలబడి, స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు: హీరోయిన్ నిధి అగర్వాల్
జాతీయ ఉత్తమ నటుడిగా మలయాళ నటుడు మమ్మూట్టి (చిత్రం - భ్రమయుగం) పేరును ప్రకటించి, వేదికపై ఆహ్వానించినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికి కెరీర్లో నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుంటున్న మమ్ముట్టిని సినీ ప్రియులు ఎంతగా అభిమానించారంటే, అప్రయత్నంగా అందరూ లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేశారు. జాతీయ స్థాయిలో మమ్మట్టికి ఉన్న ప్రత్యేక ఆకర్షణకు ఇదో ఉదాహరణ.
అంధ గాయనికి అసాధారణ గౌరవం
దేశవ్యాప్తంగా మిగతా ఇద్దరు దిగ్గజాలలాగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ, అరుదైన ఆ గౌరవం అందుకున్న ఆ అవార్డు విజేత వేరెవరో కాదు దృష్టిలోపం ఉన్న అత్యద్భుత మలయాళ గాయని వైకోమ్ విజయలక్ష్మి. ‘ఏ.ఆర్.ఎం.’లో పాడిన ‘అంగు వాన కోనిలు…’ పాటకు గాను ఆమె జాతీయ ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఎంపికయ్యారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినీ పురస్కారాలతో సహా ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న ఈమెకు ఇదే తొలి జాతీయ అవార్డు.
ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక
సినిమా కోసం వైకోమ్ విజయలక్ష్మి పాడిన పాటను తెరపై చూపుతూ, కంటిచూపు లోపం ఉన్న ఆమెను సహాయకులు వేదిక మీదకు తీసుకు వస్తుండగా… ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమకు తాము లేచి నిలబడి మరీ, ఆగకుండా నిమిషం పాటు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి సైతం ఆ గాయనీమణిని అక్కున చేర్చుకొని, మరీ అవార్డు అందించడం, ప్రత్యేకంగా అభినందనలు చెప్పడంతో సభికుల మనసు ఆర్ద్రమైంది.
అతి సామాన్యురాలైనప్పటికీ, చెదరని ఆత్మ విశ్వాసంతో అంగ వైకల్యాన్ని జయించి, ప్రపంచానికి తన సత్తా చాటిన వైకోమ్ విజయలక్ష్మికి గుజరాత్ లాంటి సుదూర ప్రాంతంలో జనమంతా లేచి నిలబడి, అభినందన పూర్వక కరతాళ ధ్వనులు చేయడం అసాధారణ అంశం.
- గుజరాత్‌లోని ఏక్తానగర్ నుంచి ఆర్. జయ
Renowned singer #VaikomVijayalakshmi receives the prestigious #NationalFilmAward for #BestFemalePlaybackSinger from the Hon'ble President of India, Smt. Droupadi Murmu, to a heartfelt standing ovation from the audience at the #72ndNationalFilmAwards ceremony! 🌟
@nfdcindia pic.twitter.com/1diDs4Me7Q— PIB in KERALAM (@PIBTvpm) September 22, 2026
Tags : 1