Breaking News

మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్‌ హీరో!

Published on Wed, 07/03/2024 - 09:12

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందకు ప్లాన్‌ చేస్తున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు చాలా కష్టపడుతున్నాడు. తన లుక్‌ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకుంటున్నాడు.  త్వరలోనే సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నారు.

(చదవండి: టాలీవుడ్‌లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!)

ఇప్పటికే స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇక తాజాగా  ఈ సినిమా విలన్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్‌ను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను ఎంపిక చేశారట. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. 

డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్‌.. ‘సలార్‌’తో పాన్‌ ఇండియా నటుడయ్యాడు.  ఆ చిత్రంలో పృథ్విరాజ్‌ ప్రభాస్‌తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్‌ పాత్రకు పృథ్వీరాజ్‌ బాగా సెట్‌ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్‌ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్‌ అయితే.. మహేశ్‌ బాబును ఢీకొట్టే విలన్‌గా పృథ్విరాజ్‌ను చూడొచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)