Breaking News

SSMB 29: మహేశ్‌కి జోడీగా హాలీవుడ్‌ భామ.. ఎవరీ నవోమీ?

Published on Sun, 11/17/2024 - 09:16

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్‌కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్‌బాబుకి జోడీగా హాలీవుడ్‌ నటి నవోమీ స్కాట్‌ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

నవోమీకి భారత మూలాలు
గతంలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్‌ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్‌ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్‌ గుజరాత్‌ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్‌ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్‌’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

షూటింగ్‌ ఎప్పుడంటే..?
‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్‌బాబుకి జోడీగా నవోమీ స్కాట్‌ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ 
నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుందని టాక్‌. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)