Breaking News

SSMB 28: పూజా హెగ్డే కోసం లగ్జరీ కారు!

Published on Fri, 02/24/2023 - 13:31

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన సినిమాలలో హీరోయిన్ల పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. గుర్తిండిపోయే డైలాగ్స్‌ చెప్పించడంతో పాటు కామెడీ చేయించి నవ్విస్తాడు. అంతేకాదు హీరోయిన్లను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలామంది స్టార్‌ హీరోయిన్లు తివిక్రమ్‌ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు.

అయితే తివిక్రమ్‌ మాత్రం ఎక్కువగా తన గత సినిమాల హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తుంటాడు. గతంలో సమంతతో వరుస సినిమాలు చేసిన తివిక్రమ్‌.. ఇప్పుడు పూజాహెగ్డేకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ‘అరవింత సమేత వీర రాఘవ’, ‘అల..వైకుంఠపురము’ తర్వాత ముచ్చటగా మూడోసారి పూజాకు చాన్స్‌ ఇచ్చాడు తివిక్రమ్‌. మహేశ్‌ బాబుతో తెరకెక్కించబోయే చిత్రంలో పూజా హెగ్డే  మెయిన్‌ హీరోయిన్‌ కాగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మరికొద్ది రోజుల్లో బుట్టబొమ్మ సెట్‌లోకి అడుగుపెట్టబోతుంది. అందుకోసం చిత్ర యూనిట్‌ ఏకంగా ఒక కొత్త కారు కొనుగోలు చేస్తుందట. షూటింగ్‌ ఉన్నంత కాలం పూజా హెగ్డే ఈ కారులోనే వచ్చి, వెళ్తుందట. సాధారణంగా అయితే హీరోల కోసం ఇలాంటి ఏర్పాటు చేస్తారు. కానీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సూచన మేరకు పూజా హెగ్డే కోసం కూడా ఓ లగ్జరీ కారును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్‌ సమయంలో హీరోయిన్‌ కోసం ఎలాగూ ఒక కారును అరేంజ్‌ చేయాలి. అదేదో అద్దెకు తీసుకునే బదులు కొత్తని కొని ఇస్తే.. ఖర్చులతో పాటు పూజా హెగ్డేకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)