Breaking News

కృష్ణమ్మతో సత్యదేవ్‌ స్టార్‌ అవుతాడు: రాజమౌళి

Published on Thu, 05/02/2024 - 05:58

‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్‌ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్‌గా స్టార్‌ని  చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్‌ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు.

 సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్‌ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌ షో ఎంటర్‌టై¯Œ మెంట్స్‌ విడుదల చేస్తున్నాయి. 

హైదరాబాద్‌లో నిర్వహించిన  ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్‌ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం  అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు  గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.  

కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్‌ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్‌ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్‌ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు.

 ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని.‘‘సత్యదేవ్‌ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే  అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్‌ రావిపూడి. 

సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్‌కి సచిన్‌ టెండూల్కర్‌గారు ఎలాగో.. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రాజమౌళి సార్‌ అలాగే. తెలుగు సినిమాని (ఆర్‌ఆర్‌ఆర్‌) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్‌ తీసుకొచ్చారు’’ అన్నారు. 

వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ–  ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్‌. మా ట్రైలర్‌ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)