Breaking News

‘బాహుబలి: ది ఎపిక్‌’లో డిలీట్‌ చేసిన సీన్స్‌, పాటలు ఇవే : రాజమౌళి

Published on Wed, 10/29/2025 - 17:36

బాహుబలి పార్ట్‌1, పార్ట్‌ 2 కలిసి ‘బాహుబలి: ది ఎపిక్‌’( Baahubali: The Epic)పేరుతో రీరిలీజ్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 31న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. ఆరున్నర గంటల నిడివిని  3:45 గంటలకు కుదించి ‘బాహుబలి: ది ఎపిక్‌’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. సినిమాలోని యాక్షన్స్‌ సీన్స్‌ అన్నింటిని కవర్‌ చేస్తూ ట్రైలర్‌ని కట్‌ చేశారు.  అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే  రన్‌టైమ్‌ 3.45 గంటలకు చేరింది. 

ఓ సినిమాకు ఇంత రన్‌టైమ్‌ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్‌ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ని కూడా డిలీట్‌ చేసినట్లు రాజమౌళి చెప్పారు. 

తాజాగా ఆయన ప్రభాస్‌(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్‌ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు. 

ప్రభాస్‌-తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ది ఎపిక్‌’లో చూడలేమట. అవంతిక లవ్‌స్టోరీ మొత్తాన్ని డిలీట్‌ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అంతేకాదు పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు.  మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.  పార్ట్‌ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)