Breaking News

ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడమే స్టార్‌డమ్‌: షారుక్‌ ఖాన్‌

Published on Sun, 10/19/2025 - 04:20

‘‘స్టార్‌ అనే ట్యాగ్‌ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్‌ ఖాన్‌ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్‌ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకున్నారు.

‘‘నాకు, ఆమిర్‌ ఖాన్‌కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్‌ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్‌ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్‌ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్‌ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నట్లే’’ అని షారుక్‌ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడమే స్టార్‌డమ్‌ అని కూడా షారుక్‌ తెలిపారు.

అది సాధ్యమే: సల్మాన్‌ ఖాన్‌ 
షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్‌ సిరీస్‌లో సల్మాన్, ఆమిర్, షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్స్‌ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్‌లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్‌ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్‌కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్‌ ఖాన్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)