Breaking News

శ్రీనువైట్ల కొత్త సినిమా.. హీరో ఎవరంటే..

Published on Fri, 10/24/2025 - 12:07

 ఈ మధ్యకాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్‌ అయితే లేదు.  ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘విశ్వం’ (2024) బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఆయన కాస్త సమయం తీసుకొని.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికీ శర్వాకి శ్రీను వైట్ల కథ వినిపించారట. శ్రీను వైట్ల మార్క్‌తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా కథ శర్వానంద్‌కు నచ్చిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట శర్వా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని భోగట్టా. 

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. మరోవైపు ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్‌’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్‌ బిజీగా ఉన్నారు. అలాగే శర్వానంద్‌ హీరోగా నటించిన కంప్లీట్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి రిలీజ్‌కు ముస్తాబవుతోంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)