Breaking News

రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..

Published on Sun, 06/08/2025 - 12:40

శ్రీను వైట్ల..ఒకప్పుడు ఆయన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సినిమా వచ్చిందంటే బ్లాక్‌ బస్టర్‌ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఆ చిత్రం తర్వాత తెరకెక్కించిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఆయన మెగాఫోన్‌ పట్టలేదు. చాలా కాలం తర్వాత ‘విశ్వం’తో మళ్లీ తిరిగి వచ్చాడు. గోపీచంద్‌ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ శ్రీను వైట్ల రీఎంట్రీకి పనికొచ్చింది.త్వరలో ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు. 

ఇదిలా ఉంటే.. శ్రీను  వైట్ల పర్సనల్‌ విషయం ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఆయన బాగా రిచ్‌ అట. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 2000 కోట్ల వరకు ఉంటుందనే వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. తాజాగా దీనిపై శ్రీనువైట్ల స్పందించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రూ. 2000 కోట్ల అధిపతి అన్న మాట అవాస్తవం. అంత రిచ్చెస్ట్‌ డైరెక్టర్‌ని నేను కాను. కానీ ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలపై వచ్చిన డబ్బుతో నేను భూములు కొన్నాను. వాటి రేట్‌ ఇప్పుడు బాగానే పెరిగింది. నాకు ఇతర అలవాట్లేవి లేదు. సినిమాలు తీయడం తప్ప వేరే ఏ పని రాదు. స్థలాల మీద తప్ప నాకు వేరే నాలెడ్జ్ లేదు. అందుకే వాటిమీదనే ఇన్వెస్ట్ చేశాను. పొలాలు కొన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది’ అని అన్నారు. 

ఇక డబ్బుల విషయంలో చాలా పొదుపరి అట కదా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నిజమే డబ్బుల విషయంలో నేను కాస్త జాగ్రత్తగానే ఉంటాను. అలా అని పిసినారిని కాదు. అవసరం మేరకు ఖర్చు చేస్తాను. డబ్బు కన్నా ఎక్కువ సినిమాకే ఇంపార్టన్స్‌ ఇస్తాను. నా వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాత నష్టపోలేదు. డిజాస్టర్‌గా నిలిచిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలోనూ నిర్మాతలు నష్టపోలేదు. నా డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో.. నిర్మాత విషయంలోనూ అలానే ఉంటాను. చెప్పిన దానికంటే తక్కువ బడ్జెట్‌లోనే సినిమాను ముగిస్తాను’ అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)