Breaking News

శివలా ‘కస్టడీ’ గుర్తుండిపోతుంది : శ్రీనివాసా చిట్టూరి

Published on Thu, 05/11/2023 - 10:15

‘‘నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘కస్టడీ’ సినిమా రూపొందింది. నాగార్జునగారి కెరీర్‌లో ‘శివ’ మూవీ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్‌లో ‘కస్టడీ’ అలా గుర్తుండిపోతుంది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్‌ సినిమా చూసిన అనుభూతితో పాటు ఓ మంచి చిత్రం చూశామనే సంతృప్తిని ప్రేక్షకులకు ‘కస్టడీ’ ఇస్తుంది’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు–తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

(చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!)

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘మన తెలుగు దర్శకులు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ‘వారియర్‌’, ‘కస్టడీ’ సినిమాలను తమిళ డైరెక్టర్స్‌తో తీశాను. ‘గ్యాంబ్లర్‌’ సినిమా నుంచి వెంకట్‌ ప్రభుతో ఓ సినిమా చేయాలనుకున్నాను.. అది ‘కస్టడీ’తో కుదిరింది. ఒక కానిస్టేబుల్‌ కథ ఇది. మంచి కథ, చక్కని స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, సీరియస్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథ సాగుతుంది.

(చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?)

ఈ కథ వినగానే ఇళయరాజాగారు, యువన్‌ సంగీతం అందిస్తామనడం హ్యాపీ. ఈ మూవీ హిట్టవుతుందనే నమ్మకంతోనే ‘కస్టడీ 2’ ఉంటుందని చెబుతున్నాం. నేను ‘యు టర్న్‌’ తీసేనాటికి సమంతగారి మార్కెట్‌ ఏంటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. అలాగే గోపీచంద్‌ ‘సీటీమార్‌’, రామ్‌ ‘వారియర్‌’, ఇప్పుడు నాగచైతన్య ‘కస్టడీ’ సినిమాలు కూడా వారి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ సినిమాలు. బడ్జెట్‌ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. మా బ్యానర్‌లో రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 90 శాతం పూర్తయింది. అలాగే నాగార్జునగారితో తీసే సినిమా షూటింగ్‌ని జూన్‌లో ఆరంభించాలని అనుకుంటున్నాం’ అన్నారు.   

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)