Breaking News

ఆ సినిమాని నేను తిరస్కరించలేదు 

Published on Sun, 04/27/2025 - 06:41

‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్‌ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్‌ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్‌గారిని రిక్వెస్ట్‌ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్‌ 3: ది థర్డ్‌ కేస్‌’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్‌ సర్కార్‌ (సినిమాలో నాని క్యారెక్టర్‌ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్‌ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్‌ 3’లాంటి క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు స్కోప్‌ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంది. ఇక నా కెరీర్‌లో ఇప్పటివరకు యాక్షన్‌ చిత్రాలే ఉన్నాయి.

 ‘కేజీఎఫ్‌’ సినిమాలో ఉన్న డైలాగ్‌ మాదిరి... ‘ఐ డోంట్‌ లైక్‌ వయొలెన్స్‌... బట్‌ వయొలెన్స్‌ లైక్స్‌ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్‌ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్‌ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్‌ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్‌ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్‌ చేయలేదు. కానీ నేను రిజెక్ట్‌ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)