రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అయ్యంగార్ ఆగ్రహం

Published on Sun, 08/27/2023 - 08:31

సినిమా రివ్యూ రైటర్లపై నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఫైర్‌ అయ్యారు. ఎవరైనా ఏదైనా సాధించి ఇంకొకడి గురించి రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యంగ్‌ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. హీరో కార్తికేయతో పాటు సినిమా టీమ్‌ అంతా ఈ ప్రోగ్రామ్‌కి హాజరైంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాట్లాడుతూ.. ‘చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయతో నటించే అవకాశం లభించింది. సూపర్‌ స్టార్‌ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు. క్రమశిక్షణతో పనిచేస్తాడు. వీటన్నింటినీ మించి ఒక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్‌ ఘోష్‌ ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం. ఆయన దగ్గరు నేర్చుకొని, ఆయనతో నటించే అవకాశం నాకు దక్కింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది జనాలకు తెలియదు, తెరపై ఆడేదే జనాలకు తెలుసు. 

 రివ్యూస్, గివ్యూస్ రాస్తారులెండి.. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు. కెమేరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు. జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరు’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)