మిత్రమండలి అలరిస్తుంది: శ్రీ విష్ణు

Published on Tue, 10/14/2025 - 00:04

‘‘మిత్రమండలి’ మూవీ సీక్వెన్స్ బాగున్నాయి. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్‌ చేయండి. ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుంది. ఇది నా ప్రామిస్‌’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం జంటగా నటించిన సినిమా ‘మిత్ర మండలి’. ఎస్‌. విజయేందర్‌ దర్శకత్వంలో బన్నీ వాసు సమర్పణలో కల్యాణ్‌ మంతెన, భాను ప్రతాప, విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై, ‘తెల్లకోడి నల్లకోడి కళ్లముందే జోడి కూడి..’ పాటను విడుదల చేశారు. దర్శకులు వివేక్‌ ఆత్రేయ, కల్యాణ్, ఆదిత్యా హాసన్ , అనుదీప్‌ అతిథులుగా హాజరై, సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.

అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘మిత్రమండలి’  హిట్‌ కాక పోతే నా నెక్ట్స్‌ సినిమా చూడొద్దు.  ‘కోర్ట్‌’ సినిమా టైమ్‌లో నాని అన్న చెప్పిందే కాపీచేసి, ‘మిత్రమండలి’ కోసం నేను చెబుతున్నాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘క్లీన్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిత్రమండలి’. ఈ దీ పావళికి రిలీజ్‌ అయ్యే నాలుగు సినిమాలూ హిట్‌ కావాలి. అందరితో  పాటుగా మనం కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తిని నేను. డబ్బులు పెట్టి పక్క సినిమాపై ట్రోలింగ్‌ చేసి ఎదుగుదాం అనుకుంటే మాత్రం... పైన దేవుడు ఉన్నాడు.. చూసే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు.

సినిమా బాగుంటే చూస్తారు. లేక పోతే నీదైనా, నాదైనా.. ఏ సినిమానైనా ఆడియన్స్ పక్కన పెడతారు. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటాను. అదే నా విజయం అని నమ్ముతాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. హిట్‌ కొడుతున్నాం అని ప్రోత్సహించిన కల్యాణ్‌ మంతెన, భాను, విజయేందర్, సోమరాజుగార్లకి థ్యాంక్స్‌’’ అన్నారు ఎస్‌. విజయేందర్‌.

‘‘మా సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. కానీ, కొంతమంది హేటర్స్‌ కూడా ఉన్నారు. వాళ్లు మా సినిమా ప్రీమియర్స్‌కి కూడా వస్తారని తెలుసు. వాళ్లకు మేము ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ హాయిగా నవ్వించడం’’ అన్నారు నిర్మాత భాను ప్రతాప. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత విజయేందర్‌. ఈ వేడుకలో చిత్రయూనిట్‌  పాల్గొంది.
 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)