Breaking News

సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!

Published on Mon, 09/14/2026 - 11:09

సంక్రాంతికి డబ్బులొస్తున్నాయి కదా అని లెక్కకు మించి తెలుగు సినిమాలు ఈ పండగనే టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే అరడజనుకు పైగా మూవీస్ బరిలో ఉండగా ఇప్పుడు మరొకటి కూడా వచ్చి చేరింది. గతంలో  'సామజవరగమన'తో సక్సెస్ అందుకున్న హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కొత్త చిత్రానికి 'ఫ్యామిలీ ప్యాక్' టైటిల్ ఫిక్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

వచ్చే పండగ రేసులో మొదట రాబోతున్న సినిమా 'మహాకాళి'. డివోషనల్ సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం జనవరి 08న రాబోతుంది. గత కొన్నేళ్లుగా ప్రతిసారి సంక్రాంతికి వస్తున్న అనిల్ రావిపూడి.. ఈసారి 'జనవరి 12 విడుదల'ని జనవరి 12న తీసుకొస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', చిరంజీవి 'కాకా' మూవీస్ 13వ తేదీన.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' 14వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. వీటిని అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడుగా ఇప్పుడు 'ఫ్యామిలీ ప్యాక్' వచ్చి చేరింది.

ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉండిపోయిన 'విశ్వంభర', డిసెంబరులో రావాల్సిన ప్రభాస్ 'ఫౌజీ' కూడా వచ్చే సంక్రాంతికి రావొచ్చని అంటున్నారు. చూస్తుంటే ఈసారి పండక్కి పెద్ద లిస్టు రెడీ అవుతోంది. కానీ చివరకొచ్చేసరికి ఇందులో ఎన్ని నిలబడతాయనేది చూడాలి?

(ఇదీ చదవండి: కళ్లుచెదిరేలా సీక్వెల్.. నయనతార 'మహాశక్తి' టీజర్ రిలీజ్)

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)