Breaking News

నో డూప్‌.. ప్రభాస్‌కు సందీప్‌రెడ్డి వంగా కండీషన్‌!

Published on Wed, 03/12/2025 - 12:13

యానిమల్‌ సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఈ యంగ్‌ డైరెక్టర్‌ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’(Spirit Movie)అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఎప్పుడో పూర్తయింది. ప్రభాస్‌ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం..షూటింగ్‌ స్టార్‌ అవుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ని సరికొత్తగా చూపించబోతున్నాడట సందీప్‌. తొలిసారి పూర్తి స్థాయి పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే ప్రభాస్‌కి సందీప్‌ కొన్ని కండీషన్స్‌ పెట్టినట్లు సమాచారం. 

షూటింగ్‌ కోసం నాన్‌స్టాఫ్‌గా 65 రోజుల కాల్షిట్లు ఇవ్వాలని, గ్యాప్‌ లేకుండా రావాలని ప్రభాస్‌(Prabhas)కి చెప్పాడట. అలాగే ఇంకో  పెద్ద కండీషనే ప్రభాస్‌ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. స్పిరిట్‌ సినిమా కోసం డూప్‌ ని వాడే ప్రసక్తే లేదని తెల్చిచెప్పాడట. ప్రతి షాట్‌ ప్రభాస్‌తోనే చిత్రీకరించాలని కండీషన్‌ పెట్టాడట. 

ఈ మధ్యకాలంలో స్టార్‌ హీరోలందరూ డూప్‌ని సెట్‌ చేసుకుంటున్నారు. యాక్షన్‌ సీన్స్‌తో పాటు చాలా సన్నివేశాలను డూప్‌తోనే కానిస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే..లాంగ్‌ షాట్‌లు, బ్యాక్‌ షాటులు, క్లోజ్‌లు మినహా మిగతాదంతా డూప్‌తో ముగించాలని కండీషన్స్‌ పెడుతున్నారు. 

ప్రభాస్‌ గత సినిమాల్లో కూడా బాడీ డబుల్స్‌(డూప్‌) వాడారు. అయితే సందీప్‌ మాత్రం సినిమాలోని అన్ని షాట్స్‌ హీరోనే డైరెక్ట్‌గా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్‌ని జూన్‌ రెండు వారంలో ప్రారంభించాలనుకుంటున్నారట. నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ పూర్తి చేసి..వచ్చే సంక్రాంతికి స్పిరిట్‌ని బరిలోకి దింపాలని సందీప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)