Breaking News

బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ

Published on Mon, 12/15/2025 - 15:13

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఆయన విగ్రహం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దీన్ని పెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బాలు విగ్రహం వద్దని అంటూ పలు ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కొన్నిరోజులుగా ఈ తతంగం నడిచింది. విగ్రహావిష్కరణ రోజు(డిసెంబరు 15) రావడంతో మళ్లీ వ్యతిరేకత కనిపించింది. దీంతో పోలీసులు.. భారీ బందోబస్తు సిద్ధం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహావిష్కరణ చేస్తారు.

ఈ వేడుకకు వచ్చిన బాలు చెల్లి, గాయని ఎస్పీ శైలజ.. అన్నయ గురించి, విగ్రహ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా  భావిస్తున్నాం. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నారు. ఇప్పుడు వాయిద్య బృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని శైలజ చెప్పుకొచ్చారు. వివాదం గురించి అడగ్గా.. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు నాకు తెలియదు, కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. బాలు తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈ విషయంలో వివాదం చేయడం సరికాదని అన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)