Breaking News

కమల్ హాసన్‌ వివాదాస్పద కామెంట్స్.. మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్!

Published on Fri, 05/30/2025 - 19:32

కమల్‌ హాసన్‌ కామెంట్స్‌పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉ‍ద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్‌ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్‌ హాసన్‌కు గట్టి షాకిచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే థగ్‌ లైఫ్‌పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్‌ హాసన్‌కు ఇచ్చిన డెడ్‌ లైన్‌ పూర్తి కాగానే థగ్‌ లైఫ్‌ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ.. కమల్‌ అండగా ఓ ప్రకటన విడుదలైంది. కమల్‌ హాసన్‌కు మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ నిలిచింది. కమల్ హాసన్‌పై ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటికోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన  వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ, భాషా రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ హాసన్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్‌ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

అయితే తాను చేసిన కామెంట్స్‌పై కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం, నాకు చట్టం, న్యాయంపై నమ్మకముంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు.. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా.. తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా.. ఇప్పటికే కమల్ హాసన్ రాబోయే చిత్రం 'థగ్ లైఫ్'ను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది.

 

 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్