Breaking News

ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్‌కు సలహాలిస్తున్న ఫ్యాన్స్‌

Published on Mon, 07/03/2023 - 10:06

కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్‌ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్‌. పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్‌నే ఉంటారు.  

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ)

ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ 'MTV రోడీస్‌ సీజన్‌ 19' షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్‌లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న  విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతోంది. అక్కడ సెట్‌లో ఉన్న వారి కోసం సోనూసూద్‌ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి  ఆమె కోరుకున్నట్లు టిఫిన్‌ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్‌ చేశారు. 

(ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్‌.. ఆయన బహుమతే కదా అంటూ..)


కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్‌ యువ నటుడు, దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు  దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్‌కు ఈ సలహా ఇచ్చారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)