Breaking News

బిగ్‌బాస్‌ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్‌: సోనియా

Published on Fri, 03/21/2025 - 14:01

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలామంది పాజిటివ్‌ పాపులారిటీకి బదులుగా నెగెటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌కు వెళ్లిన సోనియా ఆకుల (Soniya Akula) విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పెత్తనం ఉండాలి.. నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడటంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతంగా ట్రోల్‌ అయింది. తాజాగా ఆమెకు బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ వస్తే మళ్లీ వెళ్తారా? అన్న ప్రశ్న ఎదురైంది.

నాగార్జున వద్దు
అందుకు సోనియా మాట్లాడుతూ.. నాకైతే వెళ్లాలని లేదు. కానీ ఈసారి మాత్రం హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) సార్‌ ఉండకూడదని కోరుకుంటున్నాను. హౌస్‌లో నేనొకటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్‌ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా! హోస్ట్‌గా సరైన జడ్జిమెంట్‌ ఇవ్వాలి. ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్లిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను.

రానాకు ఎలా మాట్లాడాలనేది తెలుసు
రానా.. ఫ్రెండ్‌షిప్‌ను లవ్‌ అని ముద్ర వేయరనుకుంటున్నాను. తనకెలా మాట్లాడాలనేది తెలుసు. నాగార్జున హోస్ట్‌ అయితే మాత్రం నేను కచ్చితంగా బిగ్‌బాస్‌కు వెళ్లను. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలొస్తున్నాయి. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను. అందుకే నా కెరీర్‌ నెమ్మదిగా ముందుకుసాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్‌ ఆర్టిస్ట్‌ మూవీ నేడు (మార్చి 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: బెట్టింగ్‌ యాప్స్‌.. సడన్‌గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)