నా ప్రెగ్నెన్సీ పుకార్లకు కారణం ఆయనే : హీరోయిన్‌

Published on Sun, 07/06/2025 - 13:35

సెలెబ్రెటీల ప్రేమ, పెళ్లి విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. పెళ్లయ్యే వరకు డేటింగ్‌, ప్రేమ పుకార్లు చక్కర్లు కొడితే.. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ప్రెగ్నెన్సీ రూమర్స్‌ వినిస్తాయి. తండ్రి కాబోతున్న హీరో, తల్లి కాబోతున్న హీరోయిన్‌ అంటూ వార్తలు వస్తాయి. తాజాగా అలాంటి ప్రెగ్నెన్సీ పుకారే బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) విషయంలో వచ్చింది. అయితే ఆ పుకార్లకు కారణం తన భర్తే అంటుంది ఈ బ్యూటీ. దానికి సంబంధించిన ఆధారాలను బయటపెడుతూ.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌కి చెక్‌ పెట్టింది.

సోనాక్షి ఇటీవల కాస్త బరువు పెరిగింది. దీంతో ఆమె గర్బం దాల్చిందని, అందుకే బొద్దుగా మారిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. చాలా మంది నిజమే అని నమ్మారు. తాజాగా దీనిపై సోనాక్షి స్పందించారు.  తాను ప్రెగ్నెంట్‌ కాదని చెబుతూనే.. బరువు పెరగడానికి భర్తే కారణం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

భర్త జహీర్‌ ఇక్బాల్‌ రోజు తనకు ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడట. అలా బయటఫుడ్‌ తినడం వల్లే బరువు పెరగానని.. దీంతో అందరూ గర్భం దాల్చిందని అనుకున్నారని సోనాక్షి చెప్పుకొచ్చింది. అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా ‘ఆకలేస్తుందా? ఏమైనా తీసుకురావాలా?’ అని అడుగుతాడంటూ.. భర్తతో చేసిన వాట్సాప్‌ చాట్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది. 

కాగా, కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి, జహీర్‌ గతేడాది జూన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఐదు నెలల నుంచే ప్రెగ్నెన్సి రూమర్స్‌ మొదలయ్యాయి. గతంలో కూడా ఇలాంటి రూమర్సే వస్తే.. సోనాక్షి సింపుల్‌గా కొట్టిపారేసింది. ఈ సారి కూడా ఫన్‌వేలో తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌కి చెక్‌ పెట్టింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)