Breaking News

హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్‌.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్‌!

Published on Wed, 07/03/2024 - 08:28

సన్నాఫ్‌ సర్దార్‌గా అజయ్‌ దేవగన్‌ అతి త్వరలో స్కాట్లాండ్‌ వెళ్లనున్నారని బాలీవుడ్‌ సమాచారం. అజయ్‌ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్‌ దత్‌ లీడ్‌ రోల్స్‌లో అశ్వినీ ధీర్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్‌ సర్దార్‌’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. 

ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్‌ సర్దార్‌’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్‌ రోల్స్‌లో నటించిన అజయ్‌ దేవగన్, సంజయ్‌ దత్‌ సీక్వెల్‌లోనూ నటించనున్నారని, హీరోయిన్‌గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్‌లో జరిపేలా ప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్‌ దేవగన్‌–మృణాల్‌ ఠాకూర్‌ల కాంబినేషన్‌ ట్రాక్‌ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్‌. ఈ సినిమాకు అజయ్‌ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)