Breaking News

ఐఎండీబీలో...రెండో స్థానంలో శోభిత... మూడో స్థానంలో షారుక్‌

Published on Wed, 08/14/2024 - 00:06

ఫెమీనా మిస్‌ ఇండియా ఎర్త్‌ (2013) విజేతగా, మోడల్‌గా ‘గూఢచారి, మేజర్‌’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్‌ రాఘవ్‌ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్‌ ఇన్‌ హెవెన్, ది నైట్‌ మేనేజర్‌’ వంటి సిరీస్‌లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచారామె.

అందుకు  నిదర్శనం ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) తాజాగా రిలీజ్‌ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత  వారానికి సంబంధించిన పాపులర్‌ ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్‌ నటి శార్వరీ వాఘ్‌ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్‌) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు.

 బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్‌ నాలుగో స్థానం, జాన్వీ కపూర్‌ ఐదో స్థానం, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ లక్ష్యసేన్‌ ఆరు, దీపికా పదుకోన్‌ ఏడు, విజయ్‌ సేతుపతి ఎనిమిది, మృణాల్‌ ఠాకూర్‌ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్‌ పదో స్థానాల్లో నిలిచారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)