మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్
Breaking News
'ఆర్మీ జాబ్ కాదు.. నా లైఫ్'.. అమరన్ ట్రైలర్ వచ్చేసింది!
Published on Wed, 10/23/2024 - 18:41
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజాగా అమరన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
Tags : 1