Breaking News

అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే: శివ కార్తికేయన్‌

Published on Tue, 08/26/2025 - 08:02

కోలీవుడ్‌లో దళపతి విజయ్‌(Thalapathy Vijay) పేరు ఒక సంచలనం.. కోట్లాది అభిమానులను సంపాధించుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో సినిమాలు చేయనని కూడా తేల్చేశారు. అయితే, కోలీవుడ్‌ తదుపరి దళపతి ఎవరంటూ కొద్దిరోజులుగా అక్కడి సోషల్‌మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) పేరు తెరపైకి వచ్చింది. ఫ్యూచర్‌ దళపతి, కుట్టి దళపతి వంటి హ్యాష్‌ట్యాగ్స్‌ వైరల్‌ అయ్యాయి. విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా మద్ధతు ఇచ్చారు. దీంతో శివ కార్తికేయన్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. విజయ్‌ ఫ్యాన్స్‌ను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వాటిపై తాజాగా శివ కార్తికేయన్‌ రియాక్ట్‌ అయ్యారు.

దళపతి ట్యాగ్‌లైన్‌పై శివ కార్తికేయన్‌ ఇలా అన్నారు.. 'అన్న (విజయ్‌) ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.  విజయ్‌ లెగసీని కొనసాగించడం చాలా కష్టం. అది  అన్నకు మాత్రమే సాధ్యం. మరొకరి ఫ్యాన్స్‌ను గెలవాలని ఏ హీరో అనుకోరు. నేను ఇక్కడ 15 ఏళ్లుగా చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాను. కొందరి అభిమానాన్ని పొందాను అది చాలు. నాపై వచ్చే విమర్శలకు మీరు (అభిమానులు) స్పందించాల్సిన పనిలేదు. సచిన్‌, ధోనీ వంటి వారినే కొందరు విమర్శిస్తుంటారు. వారితో పోలిస్తే నేను ఎంత..? ట్రోల్స్‌పై ఎలాంటి ఆవేశాలు వద్దు. సరదాగా, సంతోషంగా నచ్చితే సినిమాలు చూడండి.' అంటూ ఫ్యాన్స్‌కు శివ కార్తికేయన్‌ సూచించారు.  ఆయన నటించిన కొత్త సినిమా మదరాసి సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది.

విజయ్‌ నటించిన 'ది గోట్' సినిమాలో శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో ఒక సన్నివేశం ద్వారా విజయ్‌ తన బాధ్యతను శివకు అప్పగించినట్లు చూపించడంతో, కొంతమంది అభిమానులు శివ కార్తికేయన్‌ విజయ్‌ వారసుడిగా భావించడం మొదలుపెట్టారు. కానీ శివ కార్తికేయన్‌ మాత్రం ‘‘విజయ్‌ లెగసీ ఆయనదే. దాన్ని ఎవరూ తీసుకోలేరు’’ అని స్పష్టంగా చెప్పారు. విజయ్‌కి శివ కార్తికేయన్‌ మీద కూడా చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా విజయ్‌, రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుంటుంది. ఇప్పుడు విజయ్‌ రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు వారు శివ కార్తికేయన్‌ పేరును తెరపైకి తీసుకొచ్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)