Breaking News

'90s' పాత్రల్లో ‘బేబీ’ జోడీ.. మిడిల్‌ క్లాస్‌ బాయ్‌ లవ్‌స్టోరీ

Published on Wed, 01/15/2025 - 13:43

వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్‌. ఒకపక్క పెద్ద సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క చిన్న చిత్రాలతో అదరగొడుతోంది. సరికొత్త కాంబినేషన్స్‌ సెట్‌ చేస్తూ.. విజయాలను అందుకుంటుంది.తాజాగా మరో కొత్త కాంబినేషన్‌తో సినిమాని ప్రకటించింది. అదే ‘90s’, ‘బేబీ’ కాంబినేషన్‌.

'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే '90s' వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments), తమ ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. '90s' సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. "మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ." అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది.

తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రకటన వీడియోతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్‌, 'బేబీ' ద్వయంతో కలిసి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)