Breaking News

అది నా డీఎన్‌ఏలోనే ఉంది.. ఎమోషనల్‌ అయిన సితార

Published on Sat, 10/14/2023 - 09:26

టాలీవుడ్​ ప్రిన్స్‌​ మహేశ్​ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని.. తాత, తండ్రి పేరు నిలబెడుతూ.. ఘట్టమనేని వారసురాలిగా దూసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఆమె పేరొక ప్రభంజనం కాబోతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖల పిల్లలకు భిన్నంగా తన మార్క్‌ను చూపిస్తుంది. అలా తనకంటూ ఓ ఫ్యాన్​ బేస్​ను కూడా సొంతం చేసుకుంది. సామాజిక సేవలో నాన్న బాటలోనే నడుస్తానని చెప్పినట్లుగానే తన అడుగులు పడుతున్నాయి.

(ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్‌)

శుక్రవారం నేషనల్‌ సినిమా డే సందర్భంగా సితార ఒక ఫోటోతో పాటు కొన్ని విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తన దృష్టిలో సినిమా అంటే కేవలం ఒక పరిశ్రమ కాదంటూ  సితార పేర్కొంది. సినిమా అనేది తన డీఎన్‌ఏలోనే ఉందని ఆమె తెలిపింది. 'లెజండరీ, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నాన్న ఎలాగైతే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నారో.. నేను కూడా అంతే. నాన్నే నా స్ఫూర్తి.' అంటూ సితార ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

(ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్‌ అయిన తమన్నా..)

ప్రస్తుతం ఇదీ నెట్టింట వైరల్‌గా మారింది. వయసులో సితార చిన్నపిల్ల అయినా ఆలోచనలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చలనచిత్ర రంగంలోకి తప్పకుండా  అడుగుపెడతానని సితార గతంలో తెలిపిన విషయం తెలిసిందే.. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)