Breaking News

నిజ జీవితంలో నాన్నకు ముఫాసాతో పోలికలు: సితార

Published on Tue, 12/17/2024 - 14:09

మహేశ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఎప్పుడో వస్తుందో తెలీదు. ఎందుకంటే రాజమౌళితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్ వర్క్ నడుస్తోంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చు. ఈ మూవీకి ముందే మహేశ్.. ఓ హాలీవుడ్ సినిమాతో రాబోతున్నాడు. ఇందులో మహేశ్ నటించట్లేదు, డబ్బింగ్ చెప్పాడంతే! అదే 'ముఫాసా: ద లయన్ కింగ్'.

డిసెంబర్ 20న ఈ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ప్రచారంలో మహేశ్ కనిపించట్లేదు. కానీ కొన్నిరోజుల క్రితం భార్య నమ్రత.. 'ముఫాసా' ఈవెంట్‌లో పాల్గొంది. ఇప్పుడు కూతురు సితార కూడా 'ముఫాసా' మూవీపై ఓ వీడియో రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష‍్మి)

'ముఫాసా తెలుగు వెర్షన్‌కి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉంది. నిజజీవితంలోనూ నాన్నకు ముఫాసాతో పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అంతలా ప్రేమిస్తారు, అండగా ఉంటారు. నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆయన కంటే నేనే.. డిస్నీ సంస్థలో 'ఫ్రోజెన్' మూవీ కోసం పనిచేశా. ఈ విషయంలో మాత్రం ఆటపట్టించాను. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు చాలా ప్రాక్టీస్ చేశారు. తొలిసారి అయినా సరే పాత్రకు సరిగ్గా సరిపోయారు. ట్రైలర్ చూసిన ప్రతిసారి.. సినిమా ఎప్పుడు వస్తుందా, చూస్తానా అనిపిస్తుంది' అని సితార తన ఆనందాన్ని బయటపెట్టింది.

2019లో 'ద లయన్ కింగ్' పేరుతో సినిమా రిలీజైంది. దీనికి ప్రీక్వెలే ఇప్పుడొస్తున్న 'ముఫాసా: ద లయన్ కింగ్'.. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు తెలుగులో మహేశ్ బాబు, బ్రహ్మానందం, అలీ, సత్యదేవ్ తదితరులు డబ్బింగ్ చెప్పారు. హిందీలో షారుక్, తమిళంలో అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలతో పాటు పెద్దవాళ్లని కూడా ఎంటర్‌టైన్ చేసే ఈ మూవీ క్రిస్మస్ వీకెండ్‌లో ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)