Breaking News

పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్‌

Published on Thu, 04/24/2025 - 07:20

గాయని ప్రవస్తి (Pravasthi) రీసెంట్‌గా ఒక వీడియోతో సింగర్‌ సునీతకు పలు ప్రశ్నలు సందించారు. వాటికి సమాధానం చెప్పాలని ఆమె కోరారు. మూడురోజులుగా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం చుట్టూ పలు విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న జడ్జెస్‌ వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్‌ చేస్తారని ప్రవస్తి కామెంట​్‌ చేశారు. వారికి నచ్చన కంటెస్టెంట్స్‌ పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పుకొచ్చారు. తనను బాడీషేమింగ్‌ కూడా చేశారని ఆమె అన్నారు. అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని సింగర్‌ సునీత ఒక వీడియోను విడుదల చేశారు. ఆపై వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సింగర్‌ సునీత మరో వీడియోను తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అయితే, ప్రవస్తి గురించి కాదు. మనిషి జీవితానికి అవసరమైన మోటివేషన్‌ ఇచ్చే లిరిక్స్‌తో ఆ పాట ఉంది. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలోని సాంగ్‌ను ఆమె పంచుకున్నారు. సిరివెన్నెల  సీతారామశాస్త్రి రచించిన ఆ పాటకు కీరవాణి సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ అందులో ఉన్నాయి. సింగర్‌ ప్రవస్తి గురించే సునీత  ఈ పాటను పోస్ట్‌ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి.

‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) ప్రోగ్రాం వల్ల తెలుగు చిత్రపరిశ్రమకు చాలామంది సింగర్స్‌ పరిచయం అయ్యారు. ఒకరకంగా ఈ వేదికపై పాటలు పాడిన చాలామంది నేడు రాణిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వేదిక మీద తమ గాత్రాన్ని వినిపించాలని పోటీ పడిన సింగర్స్‌ ఎందరో ఉన్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం ‘పాడుతా తీయగా’ జడ్జెస్‌గా ఉన్న సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలతో సంచలనంగా మారింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని ప్రవస్తి తెలిపింది. కొందరి కంటెస్టెంట్స్‌ పట్ల జడ్జెస్‌ చాలా బాగుంటారని, వారు తప్పుగా పాడినా ఫైనల్‌ వరకు తీసుకొచ్చారని కొన్ని ఆధారాలతో ప్రవస్తి బయటపెట్టింది. అయితే, సింగర్‌ సునీత, నిర్మాత ప్రవీణ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇలా పలుమార్లు వివరణలు ఇవ్వడం ఎందుకని సునీత అనుకున్నట్లు ఉన్నారు. అందుకే ఒక సినిమా పాటతో ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు ఉన్నారు. జీవితం అంటే ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుసుకోవాలని సునీత చెప్పినట్లు ఉన్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)