Breaking News

ప్రముఖ గాయని పి.సుశీలను అవార్డ్‌తో సత్కరించిన తమిళనాడు

Published on Sat, 10/05/2024 - 09:01

తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే  ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్‌ మెహతాలను అక్కడి ‍ప్రభుత్వం ఎంపిక చేసింది.  దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్‌ 3న  ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: ఆ క్రెడిట్‌ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‌

‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌  ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో  జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను  స్టాలిన్‌ అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను  గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్‌ ఆఫ్‌ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)