Breaking News

ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మిర్చి సింగర్.. ఎవరికో తెలుసా?

Published on Wed, 03/01/2023 - 15:23

ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన ‍అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్‌ సింగ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా. 

మికా తన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.

కన్వల్ దీత్ సింగ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)