Breaking News

సింగర్‌ కల్పన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Published on Wed, 03/05/2025 - 12:12

ప్రముఖ సింగర్‌ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.‘సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. కల్పనకు ఇన్‌ఫెక్షన్‌ ఉండటం వల్ల ఆక్సిజన్‌ అందిస్తున్నాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని వైద్యులు తెలిపారు.

ఏం జరిగింది?
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లిన భర్త ప్రభాకర్‌..మంగళవారం ఉదయం కల్పనకు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో కంగారుపడిన ఆయన అసోషియేషన్‌ ప్రనినిధులకు విషయం చెప్పాడు. వాళ్లు 100కి డయల్‌ చేసి పోలీసులకు చెప్పారు. ఇంటి తలుపులు తీసేందుకు పోలీసులు ప్రయత్నించగా..అది ఫలించలేదు. దీంతో ఇంటి వెనకవైపు ఉన్న కిచెన్‌ గది తలుపులు తెరచి ఇంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో కల్పన అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

(చదవండి: భర్తతో కాదు కూతురుతో సమస్యలు..బయటపడుతున్న నిజాలు!)

కారణం ఏంటి?
కల్పన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేరళకు చెందిన మొదటి భర్తతో కలిగిన కూతురుతో ఆమెకు విభేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కూతుర్ని హైదరాబాద్‌కి రమ్మని కోరగా..ఆమె నిరాకరించారట. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కల్పన నిద్ర మాత్రలు మింగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ దిశగానే విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్పన వాగ్మూలాన్ని నేడు రికార్డు చేయనున్నారు. 

నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)