Breaking News

దుస్తులు విప్పమన్న జనసేన నేత.. మండిపడ్డ చిన్మయి

Published on Sat, 01/17/2026 - 11:30

సింగర్‌ చిన్మయి సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. మహిళలపై జరిగే దాడులు, అవమానాలపై స్పందిస్తుంటారు. సోషల్‌ మీడియాలో తనను తీవ్రంగా ట్రోల్‌ చేసినా సరే.. తనకు తప్పుగా అనిపించిన అంశాలపై నిర్భయంగా మట్లాడుతుంటారు. తాజాగా ఆమె తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌ అవుతుంది. మహిళలపై జనసేన నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుస్తులు విప్పమన్న జనసేన నేత..
పవిత్రమైన సంక్రాంతి పండుగ వేళ కోనసీమ సంస్కృతిని మంటగలిపేలా రాజోలు నియోజకవర్గంలో యథేచ్చగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించారు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీ నేతలే వీటిని ప్రోత్సహించడం గమనార్హం. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ముఖ్య అనుచరుడు ఒకరు మలికిపురం మండలం గోగన్నమట్టం గ్రామంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌ నిర్వహించాడు. వేదికపై కూర్చొని ఉన్న రికార్డింగ్ డాన్సర్లతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పేసి డ్యాన్స్‌ చేయాలంటూ డ్యాన్సర్లకు కండీషన్‌ పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. సదరు జనసేన నేతపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 అశ్లీల గందరగోళమే..
ఈ వీడియోని సింగర్‌ చిన్మయి తన ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘ప్రేక్షకులు చీరింగ్ చేస్తుండగానే స్టేజ్‌పై ఉన్న అమ్మాయిలను ఇలా అవమానిస్తారని ఊహించలేదు. ఓ వ్యక్తి అమ్మాయిల దుస్తులను విప్పమంటున్నాడు. అది విని అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతున్నారు. ఇది బయటకు రావడం మంచిదా కాదా కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న భాష, ప్రవర్తన అత్యంత నీచమైనవి. ఇది పూర్తిగా అశ్లీల గందరగోళమే’ అని రాసుకొచ్చారు. చిన్మయి ట్వీట్‌పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడితే..మరికొంతమంది ఆమెను విమర్శిస్తూ.. కామెంట్‌ చేస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)