Breaking News

మోక్షజ్ఞతో ‘ఆదిత్య 369’ సీక్వెల్‌.. కథ రెడీ కానీ.. : సింగీతం శ్రీనివాసరావు

Published on Thu, 04/03/2025 - 11:04

‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ (Aditya 369 Movie) రీ రిలీజ్‌ కావడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి. శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్‌ చేసి రీ రిలీజ్‌ చేస్తుంటే... ప్రేక్షకులకే కాదు.. నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇదొక థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa) పేర్కొన్నారు. 

బాలకృష్ణ, మోహిని జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న రీ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధం చేశాం. ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు. కానీ, ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్‌ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం. 

 

ఇక నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్‌. జి. వెల్స్‌ రచించిన ‘ది టైమ్‌ మిషన్‌’ నవల ఆధారంగా ‘ఆదిత్య 369’ తీశాను. ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా. పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌ లాల్‌.. ఇలా  ముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం. పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్‌ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్‌ చేశారు’’ అని తెలిపారు.    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)