Breaking News

శశికుమార్‌కు జంటగా సిమ్రాన్‌

Published on Sat, 07/06/2024 - 13:42

నటుడు శశికుమార్‌కిప్పుడు మంచి టైమ్‌ నడుస్తోందనే చెప్పాలి. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో సతమతం అయిన ఈయన్ని విజయాల బాట పట్టించిన చిత్రం అయోధి. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడంతో పాటు, కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇటీవల గరుడన్‌ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన శశికుమార్‌కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. 

దీంతో మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా మిలియన్‌ డాలర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రంలో శశికుమార్‌ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇంతకు ముందు గుడ్‌నైట్‌ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నారని తెలిసింది. అలాగే ఇందులో శశికుమార్‌కు జంటగా నటి సిమ్రాన్‌ నటించనున్నారని సమాచారం. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దీనితోపాటు శశికుమార్‌ మరో చిత్రంలోనూ నటించనున్నారని సమాచారం. 

దీనికి రాజు మురుగన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. కూక్కూ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అని రాజు మురుగన్‌ తొలి చిత్రంతోనే ప్రాంతీయ చిత్ర కేటగిరీలో జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత జోకర్, జిప్సీ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల నటుడు కార్తి హీరోగా జపాన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం పూర్తిగా నిరాశపరచింది. దీంతో తాజాగా శశికుమార్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)