Breaking News

ఒక్క యాడ్‌తో ఫేమస్‌.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ

Published on Fri, 08/04/2023 - 10:04

ఎంతటి భారీ హీరో సినిమా అయినా సరే ముందుగా స్క్రీన్‌ మీద ఈ పాప కనిపించాల్సిందే. థియేటర్లో లైట్స్‌ ఆఫ్‌ కాగానే.. ‘ఈ నగరానికి ఏమైంది... ఓ వైపు పొగ... మరోవైపు నుసి... ఎవ్వరూ నోరుమెదపరేంటి...’ అంటూ ఒక యాడ్‌ వస్తుంది. ఇది  సినిమా ప్రారంభానికి ముందు ఆ తర్వాత ఇంటర్వెల్ సమయంలో మరోసారి వచ్చే ఈ యాడ్ అందరికీ గుర్తే.

(ఇదీ చదవండి: చిరంజీవి కుమారుడిగా 'రామ్‌ చరణ్‌' క్లోజ్‌ ఫ్రెండ్‌)

అందులో నటించిన ఓ చిన్నపాపను ఎవరూ మర్చిపోలేరు. తండ్రి సిగరెట్ తాగుతుంటే...  ఆ చిన్నారి అమాయికంగా చూసే చూపుల వల్ల సిగరెట్ పడేసి వస్తాడు అతను. ఈ యాడ్ చూసి ఎంత మంది సిగరెట్ తాగడం మానేశారో తెలీదు కానీ.. ఆ పాపకి మాత్రం చాలా పాపులారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయి పేరు సిమ్రాన్ నటేకర్. 1997లో ముంబైలో జన్మించింది. ఇండస్ట్రీలో టీనేజ్‌‌లోని అడుగుపెట్టిన ఈ చిన్నది. ఆ యాడ్‌ తర్వాత సుమారు 150కి పైగా పలు ప్రకటనలలో మెప్పించింది. తర్వాత చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లలో పూజ పాత్రతో అందరినీ మెప్పించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్‌)

ఆపై క్రిష్ 3 మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది.  2010లో రితీష్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన జానే కహాన్ సే ఆయీ హై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సిమ్రాన్ నటేకర్ చిన్న చిన్న పాత్రలలో నటిస్తోంది ఈ ముంబై చిన్నది. దీంతో మంచి అవకాశాల కోసం తెలుగు సినిమాపై కన్నేసిందట. అందుకోసం టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌లతో పలు ఆడిషన్స్‌ కూడా ప్లాన్‌ చేసిందట. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు చాలా క్రేజ్‌ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్‌ చేస్తూ సోషల్ మీడియా జనాల మతులు పొగొట్టడం మొదలుపెట్టేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)