Breaking News

ఆమె ఎవరో తెలియదు.. నేను పట్టించుకోను : సిద్ధు జొన్నలగడ్డ

Published on Tue, 10/14/2025 - 18:27

ఈ మధ్య సినిమా ప్రెస్‌మీట్స్‌లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. సెలెబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా ‘సెలెబ్రిటీ’అయిపోతామనే అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda )ను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్‌ ఘోరంగా మండిపడ్డారు. ‘తెలుసు కదా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో పాల్గొన్న సిద్దుని ఓ మహిళా జర్నలిస్ట్‌ ‘మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా(వుమనైజర్‌) ’ అని అడగడంతో స్టేజ్‌పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు. 

ఇది నా పర్సనల్‌ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్‌ కామెంట్‌ చేశారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు.

తెలుసు కదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్దు.. ‘వుమనైజర్‌’ ప్రశ్నపై మరోసారి స్పందించారు. ‘అమె అలా మాట్లాడడం అగౌరవం. మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్‌ కాదు. ఆమె అలా అడిగి..నవ్వుతున్నారు కూడా. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఈవెంట్‌ స్టార్ట్‌ అయ్యే ముందు పద్దతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. మైకు తీసుకోగానే మారిపోయారు. 

సినిమా రిలీజ్‌ ఉంది కదా..ఏం అయినా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్‌ కాదు. సినిమాకు రియల్‌ లైఫ్‌కి తేడా ఉంటుంది. సినిమాలో హీరో అండర్‌ కవర్‌ పోలీసు అయితే..బయట కూడా ఎన్‌కౌంటర్‌ చేయడు కదా? డ్రగ్స్‌ తీసుకునే పాత్రలో నటిస్తే..బయట కూడా డ్రగ్స్‌ తీసుకుంటాడని అనుకుంటామా? సినిమాకి బయటకు తేడా తెలియదా? సీనియర్‌ జర్నలిస్టులు పద్దతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్‌ కాదు. తమిళ హీరో ప్రదీప్‌ని కూడా ఆమెనె ఏదో అడిగారని, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్‌. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్‌. పెద్దగా పట్టించుకోను. నా పనిపై నేను ఫోకస్‌ పెడతా’ అని సిద్దు చెప్పుకొచ్చాడు. కాగా సిద్దు నటించిన తెలుసు కదా మూవీ అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)