Breaking News

కేరళ స్టోరీ సినిమాపై నటి పోస్ట్‌.. నెటిజన్స్‌ ఫైర్‌

Published on Wed, 05/10/2023 - 15:02

ఒక్కోసారి సినిమాతో పాటు అందులో నటించిన తారలు చిక్కుల్లో పడుతుంటారు. నటి సిద్ది ఇద్నానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ది కేరళ స్టోరి. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రాజకీయ మంటలు రేపుతోంది. దేశంలో అధికార పార్టీ మద్దతుగా నిలిచినా, ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. కారణం కేరళలో జరిగిన యదార్ధ సంఘటన ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందడమే!

అదీ 32 వేల మందిని బలవంతంగా ఇస్లామిక్‌ మతస్తులుగా మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసినట్లు చూపడంతో చిత్రంపై ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఈ చిత్రంలో గీతాంజలి అనే ఒక ప్రధాన పాత్రలో సిద్ధి ఇద్నాని నటించింది. కేరళ స్టోరీ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో నటి సిద్ధి ఇద్నాని సినిమాలో తప్పుగా ఏం చూపించలేదే అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది.

కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రం కాదని, అవగాహన కలిగించే సినిమా అని పేర్కొంది. ఇది ఏ మతాన్ని వ్యతిరేకించే చిత్రం కాదని, తీవ్రవాదాన్ని ఖండించే మూవీ అని స్పష్టం చేసింది. అలాంటి చిత్రంలో నటించడం బాధ్యతగా భావించానని పేర్కొంది. ఈ అమ్మడి వ్యాఖ్యలపై కొందరు మండి పడుతుండగా.. మరికొందరు మద్దతు ఇస్తున్నారు. 

కాగా సిద్ధి ఇద్నానీ.. హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన వెందు తనిందది కాడు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. నటుడు హరీష్‌ కల్యాణ్‌కు జంటగా నటించిన నూరు కోడి వానవిల్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్యకు జంటగా ఖాదర్‌ భాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జంబలకిడి పంబ(2018), అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ప్రేమకథా చిత్రం 2 సినిమాల్లో నటించింది.

 

చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)