Breaking News

చాలా కాలం తరువాత లవ్‌స్టోరీతో వస్తున్న సిద్ధార్థ్‌

Published on Fri, 06/07/2024 - 10:32

తమిళసినిమా: ఇటీవల చిత్తా వంటి విజ యవంతమైన చిత్రంలో నటించిన నటుడు సిద్ధార్థ్‌. తాజాగా మరోసారి ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మిస్‌యూ అనే టైటిల్‌ను నిర్ణయించారు. తమిళనాడులో బ్రాండింగ్, డిజిటర్‌ మార్కెటింగ్‌ రంగాల్లో పేరు గాంచిన 7 మైల్స్‌ ఫర్‌ సెకండ్‌ సంస్థ అధినేత సామ్యువేల్‌ మ్యాధ్యూ ఈ చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. కాగా ఇందులో తెలుగు, కన్నడం భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆషికా రంగనాథ్‌ కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

నటుడు జేపీ, పొన్‌వన్నన్, కరుణాకరన్, నరేన్, అనుపమ, రమ, బాలా శరవణన్, లొల్లు సభ మార న్, సస్టిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా మాప్పిళై సింగం, కళత్తిల్‌ సంధిప్పోమ్‌ వంటి సక్సెస్‌పుల్‌ చిత్రాల దర్శకుడు ఎన్‌.రాజశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం, కేజీ.వెంకటేశ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హీరో హీరోయిన్లకు మాత్రమే ప్రాముఖ్యత ఉండేలా కాకుండా, అందరికీ ప్రాధాన్యత ఉండేలా కథ, కథనాలు ఉంటాయన్నారు. వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంగా మిస్‌యూ ఉంటుందన్నారు. చాలా కాలం తరువాత నటుడు సిద్ధార్థ్‌ పూర్తిగా ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్‌ లవర్‌ బాయ్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్‌ 2 చిత్రంలో సిద్ధార్థ్‌ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.  



   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)