Breaking News

ఈ మూడు కారణాల వల్లే తెలుగులో రిలీజ్‌ అవుతున్న టక్కర్‌

Published on Tue, 06/06/2023 - 03:57

‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్‌ అన్నారు. సిద్ధార్థ్‌ హీరోగా కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్‌’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్‌గా నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఫ్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘టక్కర్‌’ ఒక యాక్షన్‌ ఫిల్మ్‌. న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్‌  సినిమా ఇది’’ అన్నారు.

‘‘మా గురువుగారు శంకర్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే  ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అన్నారు కార్తీక్‌ జి. క్రిష్‌. ‘‘టక్కర్‌’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌. ‘‘విశ్వప్రసాద్, వివేక్‌గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్‌’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్‌ భాస్కర్, వెంకటేశ్‌ మహా తదితరులు పాల్గొన్నారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)