Breaking News

విజయ్‌ సేతుపతి ‘ట్రైన్‌’ కోసం.. ‘శ్రుతి’ గానం

Published on Fri, 07/19/2024 - 11:08

తమిళ సినిమా: నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ట్రైన్‌ చిత్రం. నటి డింపుల్‌ హైయతీ నాయకిగా నటిస్తున్నారు. ఆర్‌.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్, వినయ్‌ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, అందులో ఓ పాటను దర్శకుడు మిష్కిన్‌ నే పాడినట్లు సమాచారం. 

కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్‌ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్‌ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కాగా డార్క్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా రూపొందుతున్న ట్రైన్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిసింది. కాగా దర్శకుడు మిష్కిన్‌ ఈ చిత్రానికి ముందు పిశాచి – 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఆ చిత్రాని కంటే ముందు ట్రైన్‌ చిత్రం తెరపైకి రానుందని సమాచారం.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)