Breaking News

యంగ్‌ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 08/01/2023 - 08:03

బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచానికి తెలిపిన నిర్మాత శోభు యార్లగడ్డ. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్‌ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తనకు నచ్చని విషయం ఏదైనా పరిశ్రమలో జరిగితే తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ ఒకటి వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఒక యంగ్‌ హీరో తన ఆటిట్యూడ్‌ వల్ల మంచి సినిమాను వదులుకున్నాడని శోభు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ వెంటనే దానిని తొలగించాడు. దీంతో ఆ యంగ్‌ హీరో ఎవరు..?  ఆ హిట్‌ సినిమా ఏమిటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

శోభు చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు. 'ఇటీవలే సక్సెస్‌లో ఉన్న ఒక యంగ్‌ హీరో తన ఆటిట్యూడ్‌ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు విజయం వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఆ హీరో వద్దకు వెళ్ళినప్పుడు తన ఆటిట్యూడ్‌తో  కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు.

ఈ విషయంపై త్వరలో రిలైజ్‌ అవుతాడని ఆశిస్తున్నా. కొత్తగా వస్తున్న వారికి మినిమమ్‌ గౌరవం అయినా ఇవ్వాలి. అప్పుడే కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోగలం. ఇలాంటి ఆటిట్యూడ్‌ తన కెరీర్‌కు ఉపయోగపడదు. ఇది ముందుగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన తెలుపలేదు.

(ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్‌)

ఇక సోషల్‌ మీడియాలో పలువురు ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమా కథను ముందుగా విశ్వక్‌ సేన్‌కు  డైరెక్టర్‌ సాయి రాజేష్‌ చెప్పాడు. కనీసం అది వినకుండా విశ్వక్‌ రిజెక్ట్‌ చేశాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా సాయి రాజేష్‌ చెప్పాడు. అందుకు  సమాధానంగా స్క్రిప్ట్ విన్న తర్వాత  నో చెప్పడం కంటే ముందే నో చెబితే బాగుంటుందని విశ్వక్ కూడా గతంలోనే కౌంటర్‌ ఇచ్చాడు. 

ఇదే గొడవపైన శోభు స్పందించాడంటూ నెటిజన్లు చెప్పుకొచ్చారు. దీంతో కొంత సమయం తర్వాత  విశ్వక్ సేన్ గురించి కామెంట్‌ చేయలేదని శోభు క్లారిటీ ఇచ్చాడు. అంతటితో ఆ గొడవకు తెర పడింది. మరి శోభు చెప్పిన యంగ్‌ హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)