Breaking News

ఓపక్క కీమోథెరపీ.. మరోపక్క షూటింగ్స్‌..: శివరాజ్‌కుమార్‌

Published on Fri, 02/28/2025 - 16:32

కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ (Shivarajkumar)కు సినిమాలపై ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అందుకనే.. ఓ పక్క క్యాన్సర్‌తో బాధపడుతున్నా సరే ఇటు షూటింగ్స్‌ వదల్లేదు. అటు కీమోథెరపీ చేయించుకుంటూనే ఇటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. చికిత్సలో భాగంగా ఇటీవలే అమెరికాలో సర్జరీ కూడా చేయించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఇంకేం చేయగలను?
నిజాయితీగా చెప్పాలంటే.. నాకు క్యాన్సర్‌ (Bladder Cancer) సోకిందన్న విషయం తెలియగానే భయపడ్డాను. కానీ దాన్ని ఎదుర్కోవడం తప్ప ఇంకేం చేయగలను? అయితే నేను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయగలనా? లేదా? అన్నదే నా ముందున్న పెద్ద ప్రశ్న! సినిమాలు చేస్తూ డ్యాన్స్‌ కర్ణాటక డ్యాన్స్‌ అనే రియాలిటీ షోకు హాజరవుతూ ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టాను. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుందని తెలుసు. దీనివల్ల నా సినిమా లుక్‌ దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాను. 

కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్‌
చికిత్స తీసుకుంటూ షూటింగ్స్‌కు వెళ్లడం వల్ల త్వరగా అలిసిపోయిన ఫీలింగ్‌ వచ్చేది. అందులోనూ కీమోథెరపీ తర్వాత సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నా ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఇలా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నప్పుడే 45 సినిమాలో క్లైమాక్స్‌ షూట్‌ కూడా పూర్తి చేశాం. అందులో నా పర్ఫామెన్స్‌ చూసి మీరు కచ్చితంగా షాకవుతారు. శివన్నా ఎలా చేయగలిగాడు? అని ఆశ్చర్యపోతారు. ఇకపోతే ఆ భగవంతుడే నన్ను ఈ క్యాన్సర్‌ గండం నుంచి గట్టెక్కించాడు.

అప్పటినుంచే తిరిగి షూటింగ్స్‌లో..
మార్చి 3 నుంచి నా తర్వాతి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటాను. రామ్‌చరణ్‌ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాను. మార్చి 5న హైదరాబాద్‌లో నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్‌కు హాజరు కానున్నాను అని చెప్పుకొచ్చాడు. శివరాజ్‌కుమార్‌ చివరగా భైరతి రణగల్‌ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన 45 మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: శుభవార్త చెప్పిన గేమ్‌ ఛేంజర్‌ హీరోయిన్‌.. ఓ మై గాడ్‌ సామ్‌ రియాక్షన్‌

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)