Breaking News

రాజకీయాల్లో తమిళ హీరోలు.. మరి మీరెందుకు లేరు?

Published on Mon, 12/22/2025 - 14:12

చాలామంది సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్‌లో అడుగుపెట్టామన్నది వారి వాదన. అలా తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్‌, విజయకాంత్‌, శరత్‌కుమార్‌, కమల్‌ హాసన్‌, విజయ్‌.. ఇలా అందరూ రాజకీయాలను ఎంచుకున్నావే.. కానీ కర్ణాటకలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఇదే ప్రశ్న ఓ విలేఖరి స్టార్‌ నటుడు శివన్నను అడిగాడు.

కారణాలేంటి?
కన్నడ నటులు శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌ బి.శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45: ది మూవీ. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అర్జున్‌ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో శివన్నకు.. కన్నడ నటులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? దానివెనక గల కారణాలేంటి? అన్న ప్రశ్న ఎదురైంది.

నా డబ్బుతో సేవ చేస్తా..
అందుకాయన స్పందిస్తూ.. నాకు రాజకీయాలు తెలియవు. అధికారం, పదవి లేకపోయినా జనాలకు సేవ చేయడమే నాకు తెలుసు. రాజకీయాలు కొన్నిసార్లు జనాల మధ్య బేధాన్ని సృష్టిస్తాయి. కానీ నేను నా డబ్బుతో ఎటువంటి పక్షపాతం చూపించకుండా జనాలకు సేవ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

ఎన్నికల్లో శివన్న భార్య
కాగా శివరాజ్‌కుమార్‌ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీత గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్‌లో నిలబడింది. భార్య కోసం శివన్న ప్రచారం కూడా చేసినప్పటికీ ఆమె ఓడిపోయింది. కాగా గీత మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె!

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)