Breaking News

విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్

Published on Fri, 11/15/2024 - 16:48

ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్‌లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.

అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు.  దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక ‍‍‍అద్భుతమైన రోల్ అని అన్నారు.

అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్‌ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్‌ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్‌ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్‌ థియేటర్లలో విడుదలైంది.

కాగా.. శివరాజ్‌ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్‌ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్‌ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్‌లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు.
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)