Breaking News

‘శివ’ చూసి ‘ఓం’ స్క్రిప్ట్‌ మొత్తం మార్చేశా: ఉపేంద్ర

Published on Tue, 12/23/2025 - 14:40

తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్‌ క్లాసిక్‌ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్‌నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.

తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్‌స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్‌ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.

శివరాజ్‌కుమార్ హీరోగా  నటించిన ఓం  కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)