Breaking News

పుష్పగాడి జాతర.. స్నేహితుడు శిల్పా రవిచంద్ర ప్రశంసలు

Published on Thu, 12/05/2024 - 13:37

బాక్సాఫీస్‌ వద్ద 'పుష్ప'గాడి రూల్‌ ప్రారంభమైంది.  అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప2' సినిమా తాజాగా విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు అల్లు అర్జున్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌లలో ఆయన దుమ్మురేపారని సోషల్‌మీడియాలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ అద్భుతమంటూ బన్నీని మెచ్చుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమాను శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి చూశారు. అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. 'పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్‌ నచ్చింది.  గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్‌ స్టార్‌ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్‌ తెప్పిస్తారు. ఈ సీన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.'అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్‌,శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇద్దరూ చాలా మంచి స్నేహితులని తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయనకు మద్ధతుగా నంద్యాలకు బన్నీ వెళ్లారు. స్నేహం కోసం తాను ఎప్పుడూ నిలబడుతానని బన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాజాగా తన కుటుంబంతో పాటు శిల్పా రవి సంధ్య థియేటర్‌కు వెళ్లారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)