Breaking News

గంగ యాక్షన్‌

Published on Thu, 07/30/2026 - 03:46

గంగ రంగంలోకి దిగి, ఏ రేంజ్‌లో విలన్ల భరతం పట్టాడో తెలుసుకోవాలంటే ‘భోగి’ సినిమా చూడాల్సిందే. గంగ ఎవరంటే హీరో శర్వానంద్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ని ఇటీవల చిత్రీకరించారు. ఇందులో భాగంగా తెరకెక్కించిన భారీ యాక్షన్‌ షూట్‌లో శర్వానంద్, 800 మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. 20 రోజులకు పైగా ఈ చిత్రీకరణ జరిగింది. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ డిజైన్‌ చేశారు. ప్రోడక్షన్‌ డిజైనర్‌ కిరణ్‌ కుమార్‌ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో చిత్రీకరించారు.

‘‘ఈ షెడ్యూల్‌ కోసం మూడు నెలలు ప్రీ- ప్రోడక్షన్‌ పనులు నిర్వహించాం. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకుల ఒళ్లు జలదరించేలా చేస్తుంది. గంగ పాత్ర కోసం శర్వానంద్‌ ప్రతిరోజూ రెండున్నర గంటలకు పైగా మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేది. మేకప్‌ తొలగించడానికి గంట పట్టేది. ఈ పాత్ర కోసం శర్వా ట్రాన్స్‌ఫార్మ్‌ అయిన విధానం, ఆయన నటన, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.

1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్‌ విలేజ్‌లో ఈ కథ సాగుతుంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: కిషోర్‌ కుమార్‌ అరోకియా, సమర్పణ: లక్ష్మి రాధామోహన్‌.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)