Breaking News

'జవాన్‌’పై మహేశ్ ట్వీట్.. షారుక్ క్రేజీ రిప్లై

Published on Wed, 09/06/2023 - 14:08

పఠాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం ‘జవాన్‌’. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం షారుఖ్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో ‘జవాన్‌’పై టాలీవుడ్‌లో కూడా మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సైతం ‘జవాన్‌’ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూస్తానని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలని ఆయన కోరుకున్నాడు. 

మహేశ్‌.. నీతో కలిసి సినిమాకు వస్తా: షారుఖ్‌
తన సినిమా గురించి మహేశ్‌ బాబు ట్వీట్‌ చేయడం పట్ల షారుఖ్‌ స్పందించాడు. ఈ చిత్రం కచ్చితంగా మహేశ్‌కు నచ్చుతుందని, తాను కూడా మహేశ్‌తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ‘థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. ‘జవాన్‌’నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు ఈ సినిమాను చూడాలనుకుంటున్నావో చెబితే.. నేను కూడా నీతో కలిసి సినిమాకు వస్తా. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు’అని షారుఖ్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, మహేశ్‌, షారుఖ్‌ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. గతంలో మహేశ్‌ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా సెట్‌కి షారుఖ్‌ వెళ్లి సందడి చేశాడు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)