Breaking News

జాతీయ అవార్డ్స్‌.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్‌ ఖాన్‌, విక్రాంత్‌

Published on Sat, 08/02/2025 - 11:28

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. తాజాగా ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో ఆయనకు గౌరవం దక్కింది. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా రాణిస్తున్న షారుక్‌ ఖాన్‌ ఎన్నో అవార్డ్లను అందుకున్నాడు. కానీ, జాతీయ పురస్కారాల్లో తనకు స్థానం దక్కలేదు. అయితే, తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లోని ‘జవాన్‌’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్‌ మెస్సీకీ అవార్డు దక్కింది. ఈ ఆనంద సమయంలో వారిద్దరూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

2023లో విడుదలై జవాన్చిత్రాన్ని దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. చిత్రానికి అవార్డ్రావడం తనకెంతో సంతోషంగా ఉందని షారుక్( Shah Rukh Khan)చెప్పారు. ' ఎంతో సంతోషంతో ఉన్నాను.. సమయంలో మాటలు రావడం లేదు. మీరు చూపించే ప్రేమకు ఫిదా అవుతున్నాను. క్షణం జీవితాంతం గుర్తుంటుంది. అవార్డ్కు నేను అర్హుడినని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా జవాన్సినిమా టీమ్కు ఎంతో రుణపడి ఉన్నాను. జవాన్సినిమాను ఎంతగానో నమ్మి దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. షూటింగ్సమయంలోనే అవార్డ్తెచ్చిపెట్టే సినిమా అంటూ చెప్పేవారు

నా టీమ్వల్లే అవార్డ్దక్కింది అనుకుంటున్నాను. నా కోసం వారు ఎంతగానో కష్టపడుతుంటారు. ఒక్కోసారి నేను అసహనం చెందినా కూడా వారు భరిస్తారు. అందుకే అవార్డ్రావడం వెనుక ప్రధాన కారణం వారేనని చెప్తాను. ఇన్నేళ్ల పాటు సినిమా పరిశ్రమలో ఉండేందుకు ముఖ్య కారణం నా కుటుంబం. ఒక్కోసారి నా భార్యతో పాటు పిల్లలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు చిరునవ్వుతోనే నా కోసం భరిస్తారు. జాతీయ అవార్డ్మరింత బాధ్యతను గుర్తుచేస్తుంది. అభిమానుల కోసం మరిన్ని మంచి సినిమాలతో పలకరిస్తాను' అని షారుక్అన్నారు.

20 ఏళ్ల కల నిజం అయింది
ఐపీఎస్‌ ఆఫీసర్‌ మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్‌ చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’లో ఇందులో హీరోగా నటించారు విక్రాంత్‌ మెస్సీ( Vikrant Massey). విధు వినోద్‌ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది. ఉత్తమ నటుడి విభాగంలో విక్రాంత్‌ మెస్సీ అవార్డ్అందుకున్నారు. క్రమంలో ఆయన ఇలా అన్నారు. షారుక్‌తో కలిసి ఈ అవార్డును పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. తన 20 ఏళ్ల కలను నిజం చేసిన చిత్ర యూనిట్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. షారుక్‌ వంటి గొప్ప స్టార్తో తొలి జాతీయ అవార్డును పంచుకోవడం తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)