Breaking News

జగన్‌ పాలన ఎక్స్‌ట్రార్డినరీ... అంతే! 

Published on Wed, 04/17/2024 - 17:06

తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్‌ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... 

అనూహ్యమైన పాలన ఇది.. 
నిజంగా జగన్‌ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్‌ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్‌ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్‌ స్కూల్స్‌కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి  ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను. 

మా సొంత ఊళ్లో... ఎంత మార్పో ! 
మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి.  గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది.  అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు.

మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి.  పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను.  
–సత్యార్థ్‌

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)